'దిశ ఎన్ కౌంటర్' చిత్రంపై కోర్టు ఎలా చెబితే అలా చేస్తాం: నిర్మాత నట్టికుమార్
- 'దిశ ఎన్ కౌంటర్' పేరిట వర్మ చిత్రం
- హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
- కేంద్రం, సెన్సార్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు
- దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్న నట్టి
దిశ తల్లిదండ్రులను బాధించేలా ఈ చిత్రం తీయలేదని, సమాజంలోని ఓ ఘటనను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామని తెలిపారు. దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని నట్టి కుమార్ స్పష్టం చేశారు. కాగా, దిశ తండ్రి ఈ సినిమాపై హైకోర్టును ఆశ్రయించగా, ఆయన వినతిపత్రంలోని అంశాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డులకు ఆదేశాలు జారీచేసింది.