పియూష్ గోయల్ కు అదనపు శాఖల బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు 
Add ap7am to your home Screen

పియూష్ గోయల్ కు అదనపు శాఖల బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

Presidential orders handing over the responsibilities of additional departments to Piyush Goyal
  • నిన్న సాయంత్రం కన్నుమూసిన పాశ్వాన్
  • పియూష్ గోయల్ కు ఆయన శాఖల బాధ్యతలు
  • ఉత్తర్వులు వెలువరించిన రాష్ట్రపతి  
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో అంతకు ముందు ఆయన నిర్వహించిన శాఖల బాధ్యతలను రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. ప్రధాని సలహా మేరకు   గోయల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
Piyush Goyal
Ram Nath Kovind
President Of India

More Telugu News