అప్పటి నుంచి నా ఆలోచన తీరు‌ మార్చుకున్నా: సినీ నటుడు నందు
Add ap7am to your home Screen

అప్పటి నుంచి నా ఆలోచన తీరు‌ మార్చుకున్నా: సినీ నటుడు నందు

nandu on his career
  • నటుడిగా విఫలం‌ కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా
  •  'సవారి' సినిమా నుంచి తన మైండ్‌సెట్‌ మార్చుకున్నా
  • ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు నచ్చుతాయో అర్థం చేసుకుంటా
'బొమ్మ బ్లాక్‌బస్టర్‌' సినిమాలో హీరోగా నటిస్తోన్న నందు తన సినీ రంగ అనుభవాలపై ఆసక్తికర విషయాలు తెలిపాడు. తన సినిమాలు పెద్దగా ఆడి ఉండకపోవచ్చని, అయితే, సినీ నటుడిగా మాత్రం విఫలం‌ కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. కొన్ని తప్పులు ఉన్నాయని,  వాటి నుంచి ఎన్నో నేర్చుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. సినీ నటుడిగా తాను మరింత ఎదగడానికి కష్టపడుతున్నానని, ఇందుకోసం తాను 100 శాతం కృషి చేస్తానని చెప్పాడు.

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చని తెలిపాడు. తాను ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోబోనని తెలిపాడు. తాను ఈ ఏడాది వచ్చిన 'సవారి' సినిమా నుంచి తన మైండ్‌సెట్‌ మార్చుకున్నానని చెప్పాడు. ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు నచ్చుతాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తాను నటుడిగా విజయం సాధించే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపాడు. కాగా, ఆయన కొత్త సినిమా  'బొమ్మ బ్లాక్‌బస్టర్‌' లో రష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
nandu
Tollywood

More Telugu News