రియాకు మద్దతుగా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు

Bollywood celebrities tweets on rhea bail
  • డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియాకు నిన్న బెయిలు
  • రియాలో నిరాశ ఆవహించకూడదన్న తాప్పీ
  • వారిని చూస్తుంటే సిగ్గుగా ఉందన్న హుమా ఖురేషీ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి నిన్న విడుదలైన నటి రియా చక్రవర్తికి మద్దతుగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఆమెకు బెయిలు రావడాన్ని స్వాగతించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు పోస్టుల ద్వారా సంఘీభావం తెలిపారు.

వ్యక్తిగత స్వార్థాల కోసం ఓ అమ్మాయిని, ఆమె కుటుంబ గౌరవాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వారిని చూస్తుంటే సిగ్గుగా ఉందని నటి హుమా ఖురేషీ పేర్కొంది. సుశాంత్ మృతిని హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అందరిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఘటనల వల్ల రియాకు నిరాశ రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తాప్సీ పేర్కొంది. సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుకుంటున్న కొందరు వ్యక్తుల కోపం రియాను జైలులో చూసిన తర్వాత తగ్గి ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

రియాపై దయ చూపించినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పినట్టు దర్శకురాలు ఫర్హాన్ ఖాన్ పేర్కొనగా, మొత్తానికి రియాకు బెయిలు వచ్చిందని దర్శకుడు అనుభవ్ సిన్హా వ్యాఖ్యానించారు. రియా ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని మరో దర్శకుడు హన్సాల్ మెహతా సూచించారు.
Go Back to Shorts
Rhea Chakraborty
Sushant Singh Rajput
Drugs case
Bollywood
Bail

More Telugu News