krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణ కుటుంబ సభ్యులంతా కలిసి వేడుక‌.. ఫొటోలు వైరల్!

krishna family photos go viral
  • సుధీర్‌ బాబు భార్య ప్రియ పుట్టినరోజు
  • వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ
  • అందరూ కలిసి భోజనం
సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్‌ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్‌ చేసింది. కేక్‌ కటింగ్ అయిపోయిన తర్వాత వారంతా కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ కడుపునిండా భోజనం చేశారు. చివరకు కృష్ణకు టాటా చెప్పి కారులో పంపించేశారు.
         
ఇందుకు సంబంధించిన ఫొటోలను హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'ఆ తేదీ వచ్చింది.. నా ప్రేమ ఈ రోజే పుట్టింది. హ్యాపీ బర్త్‌ డే ప్రియ' అని సుధీర్ బాబు అన్నాడు. ఇందులో టీడీపీ ఎంపీ, మహేశ్ బావ గల్లా జయదేవ్‌ కూడా పాల్గొన్నారు.  సూపర్‌ స్టార్ కుటుంబం అంతటిని ఒకే చోట చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  

           
krishna
Mahesh Babu
Tollywood
Viral Pics

More Telugu News