ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డొనాల్డ్ ట్రంప్... వైట్ హౌస్ కు చేరిక!
- కరోనా గురించి ఎవరూ భయపడవద్దు
- నాకు 20 ఏళ్ల వయసు తగ్గినట్టుంది
- ట్విట్టర్ లో వెల్లడించిన యూఎస్ ప్రెసిడెంట్
ఆపై తాను డిశ్చార్జ్ అయి, ఎయిర్ ఫోర్స్ వన్ చాపర్ లో తిరిగి వైట్ హౌస్ చేరుకుంటున్న వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారన్న వార్తల నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగగా, నాస్ డాక్ 466 పాయింట్లు పెరిగింది. ఈ విషయాన్ని మరో ట్వీట్ లో ప్రస్తావించిన ట్రంప్, ఇది అమెరికాకు గొప్ప వార్తని, మన ఉద్యోగాలు మనకే ఉంటాయని అన్నారు. కాగా, ట్రంప్ కు మరో వారం పాటు వైట్ హౌస్ లోనే చికిత్సను అందించాలని వైద్యులు నిర్ణయించారు.