డ్రగ్స్ కేసు.. తెలుగు హీరోలకు నోటీసులు పంపనున్న ఎన్సీబీ?
- బాలీవుడ్ ని వణికిస్తున్న డ్రగ్స్ విచారణ
- ఇప్పటికే పలువురు హీరోయిన్ల విచారణ
- విచారణలో తెలుగు నటుల పేర్లు వెల్లడైనట్టు సమాచారం
విచారణలో పేర్లు బయటకు వచ్చిన అందరి ఫోన్లపై ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు. టాలీవుడ్ నటులకు కూడా సమన్లు జారీ అయ్యే అవకాశం ఉందనే వార్తతో తెలుగు ఇండస్ట్రీ ఆందోళనకు గురవుతోంది. రెండేళ్ల క్రితం డ్రగ్స్ విచారణ టాలీవుడ్ ని వణికించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విచారణ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు.