వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతుంది... టీడీపీ మునిగిపోతున్న నావ: సత్యకుమార్
- బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన సత్యకుమార్
- ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని వెల్లడి
- వైసీపీ, టీడీపీ కుటుంబ, కుల పార్టీలంటూ వ్యాఖ్యలు
వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కుటుంబం, కులం కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజాసమస్యలపై రాష్ట్రంలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలిపారు. బీజేపీ, జనసేన పోరాటాన్ని ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అవినీతి మచ్చలేని, నిజాయతీ ఉన్న నాయకుడు అని కొనియాడారు.