లైంగిక వేధింపుల ఆరోపణల్లో నా పేరును ప్రస్తావించడంపై న్యాయ పోరాటం చేస్తా: హీరోయిన్ రిచా
- అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు
- రిచాతో అనురాగ్‌కు సంబంధం ఉందని వ్యాఖ్య
- అనవసరంగా తన పేరును లాగుతున్నారని రిచా ఆగ్రహం
అనురాగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ అనవసరంగా తన క్లయింట్ రిచా పేరును ప్రస్తావించారని, అవమానకర రీతిలో ఆమె పేరును వాడారని ఆమె లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. అనవసర వివాదంలోకి రిచా పేరును లాగి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పారు. ఇతర మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు సరికావని, ఆ హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ విషయంపై తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.