ఏప్రిల్ నాటికి దేశంలోని అందరికీ సరిపడా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్
- వ్యాక్సిన్‌కు అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభం
- టీకా అందుబాటులోకి వస్తేనే దేశంలో సాధారణ పరిస్థితులు
- మూడు వ్యాక్సిన్లకు తుది దశ క్లినికల్ పరీక్షలు
దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే అందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న ట్రంప్.. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైనట్టు చెప్పారు. టీకా కనుక అందుబాటులోకి వస్తే ప్రజల ప్రాణాలకు ఉన్న ముప్పు తొలగిపోవడమే కాకుండా, అనేక రకాల ఆంక్షల నుంచి విముక్తి లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.