బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్టే: వైసీపీకి విష్ణువర్ధన్ రెడ్డి వార్నింగ్

Dont play with BJP warns Vishnu Vardhan Reddy
  • నన్ను 20 గంటల పాటు పోలీసు వాహనాల్లో తిప్పారు
  • దేవాలయాలపై జరిగిన అన్ని దాడులపై సీబీఐ విచారణ జరిపించాలి
  • పోలీసులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా
అంతర్వేది ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఈరోజు పిలుపునిచ్చిన ఛలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమలాపురంకు చేరుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ 20 గంటలు తిప్పిన తర్వాత తనను గుడివాడకు తీసుకొచ్చారని చెప్పారు.

గుడివాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనను అరెస్ట్ చేసి, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏలూరు రేంజ్ డీఐజీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, అమలాపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్... రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన అన్ని దాడులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Vishnu Vardhan Reddy
BJP
Antarvedi
Jagan
YSRCP

More Telugu News