దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో!

Young hero turns director
  • ఏ అండా లేకపోయినా రాణిస్తున్న నిఖిల్ 
  • ప్రస్తుతం సెట్స్ పై 'కార్తికేయ 2' చిత్రం 
  • త్వరలో దర్శకుడిగా మారుతున్న వైనం
  • ప్రయోగాత్మక బాలల చిత్రమన్న నిఖిల్
మన యంగ్ హీరోలలో మంచి టాలెంట్ వున్న కొద్ది మందిలో నిఖిల్ ఒకరు. అందుకే, టాలీవుడ్ లో తనకంటూ ఏ అండా లేకపోయినా పోటీని తట్టుకుంటూ నెగ్గుకొస్తున్నాడు. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ గ్యాప్ లేకుండా కొనసాగుతున్నాడు.

అయితే, మొదట్లో దర్శకుడు అవ్వాలనే పరిశ్రమకు వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేసిన నిఖిల్ అనుకోకుండా 'హ్యాపీ డేస్' సినిమాతో హీరో అయ్యాడు. ఇక ఇప్పుడు తన అసలు ఆసక్తి అయిన దర్శకత్వంపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నాడు.

ఈ క్రమంలో త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడు. తాజగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. తాను దర్శకత్వం వహించే చిత్రం బాలల చిత్రమనీ, ఒకవిధంగా చెప్పాలంటే ప్రయోగాత్మక చిత్రమనీ చెప్పాడు.

ఇదిలావుంచితే, ప్రస్తుతం నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. త్వరలోనే ఇది ప్రారంభం అవుతుంది.
Nikhil
Kartikeya 2
Happy Days

More Telugu News