ప్రారంభమైన రైళ్ల పరుగులు.. ప్రయాణికులు ఇవి పాటించాల్సిందే!
- నిర్ణీత సమయానికి ముందే స్టేషన్‌కు రావాలి
- ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలి
- హెల్త్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి
స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు కాబట్టి నిర్ణీత సమయం కంటే ముందే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్నారు. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. స్టేషన్‌లోనూ, రైలులోనూ భౌతిక దూరం తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించాలని సూచించారు. అలాగే, ప్రయాణికులందరూ ఎవరికి వారే తమ సొంత దుప్పట్లను వెంట తెచ్చుకోవాలని త్రిపాఠీ కోరారు.