నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది: రియా

  • డ్రగ్స్ కేసులో రియాను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
  • నా కోసం నేను ఏ తప్పూ చేయలేదన్న రియా
  • అన్ని తప్పులు రియా కోసమే చేశానని వ్యాఖ్య
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో బాలీవుడ్ లో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ డీలర్ తో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తేలడంతో... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే రియా సోదరుడు షోవిక్, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది.

విచారణలో రియా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, సుశాంత్ కోసమే వాటిని తెప్పించానని చెప్పింది. అయితే, తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని తెలిపింది. తన కోసం తాను ఎలాంటి తప్పు చేయలేదని... తాను చేసిన తప్పులన్నీ సుశాంత్ కోసమేనని చెప్పింది. మరోవైపు, రియాను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Rhea Chakraborty
Sushant Singh Rajput
Bollywood
Drugs

More Telugu News