Chandrababu: సీమ, మెట్ట ప్రాంతాల‌ రైతుల మనోభావాలు దెబ్బతీసేలా ప్ర‌భుత్వ నిర్ణయం: చ‌ంద్ర‌బాబు

chandrababu slams ysrcp
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ స‌ర్కారుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉచిత విద్యుత్ కు మంగ‌ళం పాడేలా వైసీపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ‌ఉచిత విద్యుత్ అనేది‌ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు అని ఆయన చెప్పుకొచ్చారు.

దాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు రైతులను క‌ష్టాల పాలు చేసేలా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం పేరిట మీటర్లు బిగిస్తున్నారని, ప్రభుత్వం  జీవో 22ను ఉపసంహరించుకోవాలని ఆయ‌న చెప్పారు.

రాయ‌ల‌సీమ, మెట్ట ప్రాంతాల‌ రైతుల మనోభావాలు దెబ్బతీసేలా ప్ర‌భుత్వ నిర్ణయం ఉంద‌ని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. అప్పులు చేయడమే ప్రాధాన్యతగా వైసీపీ స‌ర్కారు చ‌ర్య‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ప్రజలపై గంటకు రూ.9 కోట్ల అప్పు మోపుతున్నారని ఆయ‌న తెలిపారు. జగన్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌ బానిస కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News