'దిశ.. ఎన్ కౌంటర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ!
- హైదరాబాద్ శివార్లలో దిశ హత్యాచారం, దహనం
- ఇదే కథాంశంపై తెరకెక్కుతున్న 'దిశ' చిత్రం
- నవంబర్ 26న సినిమా విడుదల
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. 2019 నవంబర్ 26న ఒక యువతిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, దహనం చేసిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్విట్టర్ లో తెలిపారు. సెప్టెంబర్ 26న టీజర్ విడుదలవుతుందని... నవంబర్ 26న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.