రియాకు ఇంకా సీబీఐ సమన్లు అందలేదు: లాయర్

  • సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ
  • శనివారం సుశాంత్ డెత్ సీన్ ను రీక్రియేట్ చేసిన సీబీఐ అధికారులు
  • సీబీఐ విచారణకు ఎప్పుడు రమ్మన్నా వెళ్తామన్న రియా లాయర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిని కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో, రియా తరపు లాయర్ ఈరోజు మాట్లాడుతూ, సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రియాకు ఇంత వరకు సీబీఐ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని చెప్పారు.

మరోవైపు సుశాంత్ స్టాఫ్ కు చెందిన ఒక వ్యక్తిని, మరో స్నేహితుడిని సీబీఐ అధికారులు బాంద్రాలోని ఆయన నివాసం ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. వారి సమక్షంలో సుశాంత్ చనిపోయినప్పటి సీన్ ను రీక్రియేట్ చేశారు. ఈ రీక్రియేషన్ ఈవెంట్ ను సీబీఐకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అధికారులు రికార్డు చేశారు.

Sushant Singh Rajput
Rhea Chakraborthy
Bollywood
CBI

More Telugu News