మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన స్పెషల్ బ్రాంచ్ సీఐపై వేటు

Hyderabad CP Anjani Kumar suspends CI
  • సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన మహిళ
  • ఇలాంటి ఘటనలు సహించబోమన్న సీపీ
  • ఎవరైనా వేధిస్తే 94906 16555 వాట్సాప్ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచన
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సీఐను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.చందర్ కుమార్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన చందన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే 94906 16555 వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేయాలని సూచించారు.
Go Back to Shorts
Hyderabad
Special branch police
Anjani Kumar
CI

More Telugu News