ఈ రెండు భయాలు మిమ్మల్ని భయపెడుతున్నాయి విజయసాయిరెడ్డి గారు: బుద్ధా వెంకన్న
- ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిలయ్యారనే ఆందోళన
- మళ్లీ కరోనా కాటేస్తుందేమోననే భయం
- మీ నాయకుడు ఇంట్లో పడుకుని 6 నెలలు అయింది
కరోనాపై వీరోచిత పోరాటం చేస్తానంటున్న మీ నాయకుడు తాడేపల్లిలోని ఇంట్లో పడుకుని 6 నెలలైందని బుద్దా అన్నారు. ట్వీట్ల తిట్లతో మీరు, వీడియో కాన్ఫరెన్సు అంటూ అర్థంకాని తెలుగులో జగన్ కబుర్లు చెప్పడం తప్ప... ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, రోడ్ల మీదే ప్రజలు ప్రాణాలు వదులుతుంటే పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.