ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న బాలు తప్పకుండా కోలుకుంటారు: పవన్ కల్యాణ్
- కరోనా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు
- ఐసీయూలో చికిత్స
- తమ కుటుంబానికి బాలు సన్నిహితుడని పవన్ వెల్లడి
చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బాలు లైఫ్ సపోర్ట్ తో ఉన్నారని నిన్న తెలియగానే, ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఇది ఎంతో ఊరటనిచ్చే వార్త అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి బాలు ఎంతో సన్నిహితుడని, ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ తన ప్రకటనలో వివరించారు.