'కందిరీగ' కాంబినేషన్లో మరో సినిమా!

Ram to work with Santosh again
  • తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన సినిమా 'కందిరీగ'
  • సంతోష్ చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్
  • స్రవంతీ రవికిశోర్ బ్యానర్ పై నిర్మాణం
యంగ్ హీరో రామ్ కి ఎనర్జిటిక్ హీరోగా పేరుంది. ఏ పాత్ర పోషించినా మంచి ఎనర్జీతో .. చలాకీగా.. చురుకుగా కనిపిస్తాడు. ఆయా పాత్రలలో మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. అలాంటి రామ్ తొమ్మిదేళ్ల క్రితం చేసిన సినిమా 'కందిరీగ'. కెమెరా మేన్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం అది. ఆ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. దాంతో సూపర్ హిట్టయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ దర్శకుడు సంతోష్ 'రభస', 'హైపర్' సినిమాలు చేసినా అంతగా ఆడలేదు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తో 'అల్లుడు శ్రీను' చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.

ఇదిలావుంచితే, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ఓ చిత్రం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కథను రెడీ చేసినట్టు చెబుతున్నారు. రామ్ కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ పెదనాన్న స్రవంతీ రవికిశోర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించనున్నారు. హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి దీనికి మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.    
Go Back to Shorts
Ram
Santosh Srinivas
Kandireega

More Telugu News