పచ్చని మొక్కలు మతానికి విరుద్ధమట.. 6 వేల మొక్కలు పీకేశారు!

12-08-2020 Wed 16:58 | International
  • ఇమ్రాన్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల మొక్కలను నాటిన వైనం
  • పాకిస్థాన్ లోని ఖైబర్ రాష్ట్రంలో 6 వేల మొక్కలు పీకేసిన వైనం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఖైబర్ ముఖ్యమంత్రి
అర్థం పర్థం లేని మతఛాందసవాదంతో కొందరు పర్యావరణానికే ముప్పుగా పరిణమించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నాటిన వేలాది మొక్కలను పీకేసిన ఘటన పాకిస్థాన్ లోని ఖైబర్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పర్యావరణం దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ వ్యాప్తంగా మొక్కలను నాటాలంటూ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు  35 లక్షల మొక్కలను నాటారు.

అయితే మొక్కలను నాటిన గంటల వ్యవధిలోనే ఖైబర్ రాష్ట్రంలోని మండికాస్ జిల్లాలో కొందరు అతివాదులు రెచ్చిపోయారు. మొక్కలు నాటడం తమ మతానికి వ్యతిరేకమంటూ ఓ గ్రౌండ్ లో నాటిన దాదాపు 6 వేల మొక్కలను పీకేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఘటనతో పర్యావరణ ప్రేమికులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఖైబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మొక్కలను పీకిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
PakistanSaplings plantation

More Telugu News

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03
..more