రవితేజ సినిమాలో మరో నాయికగా రాశిఖన్నా

  • రమేశ్ వర్మ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం 
  • ఇప్పటికే ఓ నాయికగా నిధి అగర్వాల్ ఎంపిక
  • తమిళ చిత్రానికి రీమేక్ గా నిర్మాణం  
గతంలో రవితేజ సరసన 'బెంగాల్ టైగర్', 'టచ్ చేసి చూడు' వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన రాశిఖన్నా ఇప్పుడు మరోసారి అతనితో జతకట్టనుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే చిత్రంలో రాశిఖన్నాను ఓ హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మరో కథానాయికగా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు, అందుకే ఇద్దరు కథానాయికలను తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇదిలావుంచితే, తమిళంలో ప్రస్తుతం నిర్మాణంలో వున్న 'శతురంగ వెట్టెయ్ -2' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. తమిళ వెర్షన్ లో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటిస్తున్నారు. మరోపక్క, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'క్రాక్' సినిమా షూటింగ్ దశలో వుంది. ఇటీవల లాక్ డౌన్ సమయంలో రవితేజ పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటూ, ఇప్పటికే కొన్ని ప్రాజక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  

Rashi Khanna
Raviteja
Trisha
Nidhi Agarwal

More Telugu News