అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు!
- కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు
- నెలాఖరు వరకూ స్కూళ్లు, కాలేజీలు బంద్
- జాగ్రత్తలతో పంద్రాగస్టు వేడుకలు
ఇదే సమయంలో మూవీ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవరాదని ఆదేశించింది. యోగా శిక్షణా కేంద్రాలతో పాటు జిమ్ లు భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ నిబంధనలు పాటిస్తూ, కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. పంద్రాగస్టు సందర్భంగా వేడుకలను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించుకోవాలని సూచించింది. ఇక కంటెయిన్ మెంట్ జోన్లు అమలవుతున్న ప్రాంతాల్లో నెలాఖరు వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇక్కడ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది.