నాడు 'టక్కరి దొంగ' సెట్ కు వెళ్లిన అఖిల్... కౌబాయ్ గెటప్ వేయించిన మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాడు 'టక్కరి దొంగ' సెట్ కు వెళ్లిన అఖిల్... కౌబాయ్ గెటప్ వేయించిన మహేశ్ బాబు!

Hero Akhil Cowboy Photo Viral
  • రెండేళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన అఖిల్
  • కౌబాయ్ వేషం వేసుకుని గన్ పట్టుకున్న అఖిల్
  • ఓ మూవీ కావాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు
హీరోగా తన కెరీర్ ను ప్రారంభించిన తొలినాళ్లలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'టక్కరి దొంగ' చిత్రం విడుదలై, విమర్శకుల ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తుంటే, బుల్లితెర వీక్షకులు అంటిపెట్టుకుని పోతుంటారు. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటనకు చెందిన చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్, తన రెండేళ్ల వయసులోనే తెరంగేట్రం చేసి 'సిసింద్రీ' సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక అఖిల్, 'టక్కరి దొంగ' సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లినప్పటి ఓ ఫొటో, ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. కౌబాయ్ గెటప్ లో తలపై హ్యాట్, చేతిలో తుపాకితో అఖిల్ కనిపిస్తున్నాడు. బుల్లి అఖిల్ నాడు షూటింగ్ స్పాట్ కు వెళ్లగా, మహేశ్, సినిమా దర్శకుడు జయంత్ సీ పరాన్జీలు అఖిల్ ను ఇలా తయారు చేయించి, ఫొటో తీశారట. అది ఇప్పుడు బయటకు రాగా, అఖిల్ తో ఓ కౌబాయ్ మూవీ తీయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాగ్ కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 
Akil
Cowboy
Mahesh Babu
Takkari Donga

More Telugu News