టిక్‌టాక్‌కు డెడ్‌లైన్ విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- మా దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలి
- లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తాం
- 6 వారాల గడువు ఇస్తున్నాను
తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తామని చెప్పారు. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను తమ దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి 6 వారాల గడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
అంటే సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగియాలని చెప్పారు. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్ద సంస్థకు విక్రయించాలని ఆయన చెప్పారు. భద్రత విషయంలో తమకు ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని తెలిపారు. కాగా, టిక్‌టాక్ యాప్ కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్ కూడా తెలిపిన విషయం తెలిసిందే.