సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: ఏపీ సీఎం జగన్

Schools will be reopened on 5th September says Jagan
  • ఆగస్ట్ 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పూర్తి చేయాలి
  • ఈ పనులపై రెండు రోజులకు ఒకసారి కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి
  • ఆగస్ట్ 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తాం
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూత పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఏడాది ఇంకా పాఠశాలలు ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 5వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి జగన్ ఈరోజు తెలిపారు. ఆగస్ట్ 31వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనులపై ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh
Schools

More Telugu News