హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా రికార్డు... పవర్ స్టార్ ను అధిగమించిన టాలీవుడ్ ప్రిన్స్!
- సోషల్ మీడియాలో పోటీ పడుతున్న ఫ్యాన్స్
- పవన్ పుట్టిన రోజు సందర్భంగా 2.7 కోట్ల ట్వీట్స్
- 'హ్యాపీ బర్త్ డే మహేశ్'పై 3 కోట్ల ట్వీట్స్
ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దాటేశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ 2.7 కోట్ల ట్వీట్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రికార్డు కొద్ది కాలంలోనే తుడిచిపెట్టుకుపోయింది. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే జరుగనుండగా, ఆయన ఫ్యాన్స్ 'హ్యాపీ బర్త్ డే మహేశ్' అనే హ్యాష్ ట్యాగ్ ను అప్పుడే వైరల్ చేసేశారు. ఇది 3 కోట్ల ట్వీట్స్ ను దాటేసి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.