రజనీకాంత్ కు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!

  • చెన్నైలో కారులో ప్రయాణం
  • సీట్ బెల్ట్ ధరించని సూపర్ స్టార్
  • రూ. 100 జరిమానా విధించిన పోలీసులు
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు జరిమానా విధించారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు. వివరాల్లోకి వెళితే, ఇటీవల చెన్నై నగరంలో కారులో ప్రయాణించిన వేళ, రజనీకాంత్, సీటు బెల్టును ధరించలేదు. ఇది ట్రాఫిక్ పోలీసుల కన్నుకు  చిక్కింది. దీంతో వారు రూ.100 జరిమానా విధించారు. ఈ జరిమానా ఇంకా పెండింగ్ లోనే ఉండటం గమనార్హం.కాగా, చెన్నైలోని తన నివాసం నుంచి కెలంబాక్కంలో ఉన్న ఫామ్ హౌస్ కు రజనీకాంత్ కారులో వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆయన సీట్ బెల్ట్ ధరించలేదు. ఇక, రజనీపై జరిమానా విషయం వెలుగులోకి వచ్చిన తరువాత, అసలు ఆయన తన ప్రయాణానికి పోలీసుల నుంచి పాస్ లు తీసుకున్నారా? అని నెట్టింట ప్రశ్నలు వస్తున్నాయి.

Rajanikant
Traffic Police
Fine
Chennai

More Telugu News