మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి మహాబలుడు.. సెప్టెంబరులో రాయ్‌జోన్స్‌తో టైసన్ ఢీ!
- 2005లో బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పిన టైసన్
- పునరాగమనానికి సిద్ధంగా ఉన్నట్టు వీడియో
- చారిటికీ నిధులు సమకూర్చడం కోసమేనన్న మైక్
టైసన్ పోస్టు చేసిన ఈ వీడియోలో అతడు సాధించిన టైటిళ్లను చూపించాడు. ఓ పంచ్ ఇవ్వగానే ‘హి ఈజ్ బ్యాక్’ అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఈసారి తాను బరిలోకి దిగబోయేది ఓ చారిటీకి నిధులు సమకూర్చడం కోసమేనని టైసన్ పేర్కొన్నాడు. వచ్చేస్తున్నా సిద్ధంగా ఉండండంటూ ప్రత్యర్థులకు టైసన్ సవాలు విసిరాడు.