ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు... పెరుగుతున్న మరణాలు

  • కొత్తగా 2,602 మందికి పాజిటివ్
  • 24 గంటల్లో 42 మంది మృతి
  • 534కి పెరిగిన కరోనా మరణాలు
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు దాటింది. రాష్ట్రంలో కొత్తగా 42 మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 534కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో మరో 2,602 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి.  అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. తాజాగా 837 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,814 మంది చికిత్స పొందుతున్నారు.

Corona Virus
Andhra Pradesh
Positive
Deaths
COVID-19

More Telugu News