Mahesh Babu: మహేశ్ సినిమాకి పవర్ ఫుల్ విలన్ కావాలట!

Villain to be finalized for Mahesh movie
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబుకి తగ్గా విలన్ దొరకడం ఇప్పుడు చాలా కష్టమైపోయింది. పరశురాం దర్శకత్వంలో మహేశ్ తాజాగా 'సర్కారు వారి పాట' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో దేశంలో చోటుచేసుకున్న బ్యాంకు మోసాల నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. ఇందులో ప్రధాన విలన్ పాత్ర కూడా చాలా ప్రధానమైందట. ఇంకా చెప్పాలంటే, హీరోకి సమాంతరంగా సాగుతుంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ హీరోని ఇబ్బందులపాలు చేసే పాత్ర అదని అంటున్నారు.

ఇటువంటి పవర్ ఫుల్ పాత్రలో మరి పవర్ ఫుల్ నటుడే వుండాలి కదా? అందుకే చిత్ర బృందం సరైన నటుడి కోసం అన్వేషిస్తోంది.ఈ కోవలో కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలోనూ ఒకరిని ఈ ప్రధాన విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే, ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. త్వరలో వీరి ఎంపిక పూర్తవుతుంది. ఇక ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే!
Go Back to Shorts
Mahesh Babu
Parashuram
Aravind Swamy
Upendra

More Telugu News