నాకు కరోనా వచ్చినా భయపడను: మంత్రి పువ్వాడ అజయ్
- మన దేశ జనాభా ఎక్కువ
- తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది
- నాకు కరోనా వస్తే గాంధీలో చికిత్స చేయించుకుంటా
మీడియాలో వస్తున్న నెగెటివ్ వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని... అందుకే కరోనా రోగిని వెలివేసే విధానం సమాజంలో ఏర్పడిందని అజయ్ తెలిపారు. తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ఇదే సమయంలో మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వాల వైఫల్యం ఉండదని, ఈ అంశంపై విపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. విమర్శించే వాళ్లకు బుద్ధి లేదని చెప్పారు. కరోనా విషయంలో అలర్ట్ చేయండంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తనకు కరోనా వచ్చినా భయపడనని... గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతానని చెప్పారు.