ఉల్లాసంగా, ఉత్సాహంగా... దర్శకేంద్రుడి సైక్లింగ్
- తన ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కిన దర్శకేంద్రుడు
- రాఘవేంద్రరావును ఫాలో అయిన పెంపుడు శునకం
- నమ్మదగిన నేస్తం అంటూ ట్వీట్
దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుర్రాడి మాదిరే టీషర్ట్, షార్ట్స్ ధరించిన ఆయన తన ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కుతూ ఆస్వాదించారు. ఆయన వెనుకే పెంపుడు శునకం కూడా పరుగులు తీస్తూ కనిపించింది. దీనిపై రాఘవేంద్రరావు స్పందిస్తూ, "ఈ ప్రపంచం మనకు ప్రసాదించగలిగిన దాంట్లో ఉత్తమమైనవి ప్రకృతి, దేహదారుఢ్యం, నమ్మదగిన నేస్తం" అంటూ ట్వీట్ చేశారు.