వర్మకు షాకిచ్చిన 'పవర్ స్టార్' పాత్రధారి... సినిమా ఆగిపోయినట్టే!
- ఇటీవల కొత్త సినిమాను ప్రకటించిన వర్మ
- పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి
- తాను ఆ పాత్రను చేయలేనన్న నటుడు
ఇక తాజా సమాచారం ప్రకారం, పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒత్తిడితో 'పవర్ స్టార్' హీరో వర్మకు హ్యాండిచ్చాడట. ఆ పాత్రను తాను చేయలేనని అతను స్పష్టం చేయడంతో వర్మ ఈ సినిమాను పక్కన పడేశారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు పవన్ లా కనిపించే మరో వ్యక్తిని తీసుకుని రావడం చాలా కష్టమని వర్మ భావించారట. ఈ విషయంలో వర్మ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.