ముంబయిలో భారీ వర్షపాతం... రాగల 24 గంటల్లో కుంభవృష్టి!
- గత రెండ్రోజులుగా ముంబయిలో భారీ వర్షపాతం
- నీట మునిగిన పలు ప్రాంతాలు
- కరోనాకు తోడు వర్షాలతో ముంబయి అతలాకుతలం
గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. చెంబూర్, సెంట్రల్ ముంబయి నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొలాబా అబ్జర్వేటరీ, శాంతాక్రజ్ ప్రాంతాల్లో గడచిన 24 గంటల వ్యవధిలో కుండపోత వానలు కురిశాయి. రాగల 24 గంటల్లో ముంబయిలో కుంభవృష్టి తప్పదని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) చెబుతోంది.