'గ్లో' మాది... హిందుస్తాన్ యూనీలీవర్ తో ఇమామీ సరికొత్త వార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గ్లో' మాది... హిందుస్తాన్ యూనీలీవర్ తో ఇమామీ సరికొత్త వార్!

New War Between Emami and HUL
  • సౌందర్య సాధనాల ఉత్పత్తుల మార్కెట్లో కొత్త యుద్ధం
  • ఇటీవలే విడుదలైన ఇమామీ 'గ్లో అండ్ హ్యాండ్ సమ్'
  • న్యాయ నిపుణులతో ఇమామీ సంప్రదింపులు
భారత సౌందర్య సాధనాల ఉత్పత్తుల మార్కెట్లో సరికొత్త యుద్ధం మొదలైంది. హిందుస్తాన్ యూనీలీవర్ నుంచి మార్కెటింగ్ అవుతున్న పురుషుల బ్రాండ్ 'ఫెయిర్ అండ్ లవ్లీ' పేరును 'గ్లో అండ్ లవ్లీ'గా మార్చడమే ఇందుకు కారణం. ఇప్పటికే 'గ్లో అండ్ హ్యాండ్ సమ్' పేరిట పురుషుల సౌందర్య క్రీమ్ ను అందిస్తున్న ఇమామీ, ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. హెచ్యూఎల్, తమ బ్రాండ్ పేరు కలిసి వచ్చేలా 'గ్లో' అన్న పదాన్ని చేర్చిందన్నది ఇమామీ ఆరోపణ.

తాము మార్కెటింగ్ చేస్తున్న బ్రాండ్ పేరు కలిసొచ్చేలా హెచ్యూఎల్ కొత్త పేరును ప్రకటించిందంటున్న ఇమామీ, ఇప్పుడు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబందించిన న్యాయ నిపుణులను సంప్రదించింది. కాగా, ఇప్పటికే ఇమామీ 'జండూబామ్', 'నవరత్న ఆయిల్' పేరిట రెండు ప్రసిద్ధ ప్రొడక్ట్ లను మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పురుషుల సౌందర్య సాధనాల ఉత్పత్తుల్లో 'గ్లో అండ్ హ్యాండ్ సమ్'కు కూడా వాటా ఉంది.

అయితే, ఇమామీ సంస్థ ఈ 'గ్లో అండ్ హ్యాండ్ సమ్'ను ఇటీవలే విడుదల చేసింది. అంతకుముందు 'ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్' పేరిట ఇదే ప్రొడక్ట్ ను మార్కెటింగ్ చేసిన ఇమామీ, వాస్తవానికి హిందుస్తాన్ యూనీలీవర్ తో పోలిస్తే, ఓ అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ఇప్పుడు అదే రెండు కంపెనీల మధ్యా చిచ్చు రేపింది. హెచ్యూఎల్ పై చర్యలను తీసుకునే మార్గాలను అన్వేషించాలని న్యాయ నిపుణులను కోరినట్టు ఇమామీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంలో ఇంకా హిందుస్తాన్ యూనీలివర్ స్పందించ లేదు.
Emami
HUL
Fair and Handsom
Glow and Handsom

More Telugu News