రోజుకు వెయ్యిమంది.. లాక్‌డౌన్ భయంతో ఏపీకి తరలుతున్న జనం!
- హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులు
- పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలుతున్న ఏపీ వాసులు
- సరిహద్దుల వద్ద కోలాహలం
థర్మల్ స్క్రీనింగ్ అనంతరం చేతిపై ‘హోం క్వారంటైన్’ ముద్ర వేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే వీరిని అనుమతిస్తున్నారు. మరోవైపు, ఈ-పాస్‌లు ఉన్నవారే రాష్ట్రానికి రావాలని, లేని వారు వచ్చి ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, గత నెల 24 నుంచి 26 మధ్య రోజుకు సగటున 800 మంది ఏపీకి రాగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఈ సంఖ్య వెయ్యి దాటింది. 29న 1,044 మంది రాష్ట్రానికి రాగా, 30న 1,088 మంది, ఈ నెల 1న 1,130 మంది ఏపీలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, 15 రోజుల క్రితం రోజుకు సగటున 300 వాహనాలు ఏపీలోకి రాగా, ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు అయింది.