తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయొద్దు: హైకోర్టు
- తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని పీవీపీపై కేసు
- విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్
- బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు
- విచారణ ఈ నెల 27కు వాయిదా
ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయగా, దానిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.