Power Star Movie: వర్మ కొత్త సినిమాపై పూనం కౌర్ కామెంట్స్!

Poonam Kaur comments on RGV movie title
షార్ట్స్‌లో చూడండి
ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కాబోతున్న తన తదుపరి చిత్రం టైటిల్ 'పవర్ స్టార్' అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం సంచలనంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఈ సినిమాను  తీశారో టైటిల్ తోనే  అర్థమవుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో పీకే, ఎంఎస్, ఎన్బీ, టీఎస్, ఒక రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది దున్నపోతులు ఉంటాయని ఆయన తెలిపారు. దీనిపై సినీ నటి పూనంకౌర్ మండిపడ్డారు.

ఈ సినిమాలో ఆర్జీవీ క్యారెక్టర్ ను కూడా పెట్టాలని సూచించింది. అమ్మాయిల బలహీనతలను తెలుసుకుని, వారిని రెచ్చగొట్టడం, మళ్లీ స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం వంటి పనులను చేసే వాడి పాత్రను కూడా పెట్టాలని పేర్కొంది. వర్మను తాను చిన్నప్పుడు ఎంతో అభిమానించేదాన్నని... కానీ ఇప్పుడు ఆయనను చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపింది.  
Go Back to Shorts
Power Star Movie
Tollywood
Ram Gopal Varma
Poonam Kaur

More Telugu News