కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. నగ్నంగా వీడియోలు తీసి బీటెక్ విద్యార్థినికి వేధింపులు
- మూడేళ్లుగా వేధిస్తున్న ఇద్దరు యువకులు
- నగ్న వీడియోలను ఇంటర్నెట్లో పెట్టి వేధింపులు
- ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు
అనంతరం ఆమె ఇంజినీరింగ్‌లో చేరగా అక్కడామెకు కౌశిక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో కౌశిక్ కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి యువతి గురించి వివరాలు సేకరించగా వరుణ్ విషయం బయటకు వచ్చింది. వరుణ్ తీసిన వీడియోలను సేకరించి కౌశిక్‌కు చూపించారు. దీంతో అతడు ఆమెకు దూరంగా జరిగాడు. అయితే, యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన కౌశిక్ తన వద్ద ఉన్న నగ్నవీడియోలను ఇంటర్నెట్లో పెట్టడంతోపాటు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.
విషయం తెలిసిన యువతి బంధువులు వరుణ్, కౌశిక్ కుటుంబ సభ్యులను కలిసి ఆ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చేశారు. అయితే, ఇటీవల మళ్లీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ కనిపించడంతో విస్తుపోయిన యువతి తాజాగా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుణ్, కౌశిక్‌లను అరెస్ట్ చేశారు.