మహేశ్ బాబు బ్యానర్లో శర్వానంద్!
- మహేశ్ బాబు సొంత చిత్ర నిర్మాణం
- అడివి శేష్ తో ఇప్పటికే 'మేజర్' సినిమా
- తాజాగా విన్న కథలో శర్వానంద్ హీరో
ఈ క్రమంలో యువ హీరో శర్వానంద్ కూడా మహేశ్ బాబు బ్యానర్ లో ఓ చిత్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తాను విన్న ఓ కథకు శర్వా అయితే బాగా సూటవుతాడని మహేశ్ భావిస్తున్నాడట. దీంతో ఈ విషయంలో శర్వాతో అప్పుడే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. మామూలుగా కథలో కొత్తదనం ఉంటేనే శర్వా సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాడు. ఇది మహేశ్ ఎంచుకున్న కథ కాబట్టి శర్వాకి కూడా నచ్చుతుందని అంటున్నారు.