మహేశ్ బాబు రిక్వెస్ట్ .. శిశువుకి ఉచితంగా ఆపరేషన్

Operation for One Month Baby after request from Hero Mahesh Babu
  • అరుదైన గుండె జబ్బుతో పుట్టిన బిడ్డ
  • విషయం తెలుసుకుని స్పందించిన టాలీవుడ్ ప్రిన్స్
  • ఆపరేషన్ చేసిన ఆంధ్రా హాస్పిటల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కోరిక మేరకు, నెల రోజుల చిన్నారికి ఆంధ్రా హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ లో గుండె ఆపరేషన్ ను వైద్యులు ఉచితంగా విజయవంతంగా చేశారు. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు, పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. ఆపై తమ బిడ్డను తల్లిదండ్రులు ఆసుపత్రికి చేర్చగా, 2వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతో, వైద్యులు పాపను   ఐసీయూకు తరలించారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు.
Go Back to Shorts
Andhra Hospital
Mahesh Babu
Operation

More Telugu News