బంధుప్రీతి అన్ని చోట్లా ఉంటుంది... కష్టపడినవాళ్లే స్టార్లు అవుతారు: హీరో నిఖిల్
- అభిమానులతో నిఖిల్ లైవ్ చాట్
- బంధుప్రీతి గురించి ప్రశ్నించిన ఫ్యాన్స్
- తనకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదని వెల్లడి
అయితే, తనకెప్పుడూ ఇండస్ట్రీలో బంధుప్రీతి కారణంగా ఇబ్బందులు కలగలేదని, టాలీవుడ్ తనను నిజంగా అక్కున చేర్చుకుందని వెల్లడించారు. తెలుగు సినీ కుటుంబంలో తాను కూడా ఒకడ్ని అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి తన గురించి మాట్లాడారని, జీవితంలో అదొక గొప్ప సుదినం అని భావిస్తానని నిఖిల్ పేర్కొన్నారు.