సుశాంత్ మృతికి కారణమైన వారెవరూ అతని అంత్యక్రియలకు హాజరు కాలేదు: నికీషా పటేల్  

  • సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు హాజరుకాలేదు?
  • భోజనం చేస్తూ బిజీగా ఉన్నారా?
  • బాలీవుడ్ లో మానవత్వం ఎక్కడుంది?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువని... ఇతరులను కొందరు ఎదగనివ్వడం లేదంటూ ఇప్పటికే కంగనా రనౌత్, తాప్సీ, శ్రద్ధాదాస్ వంటి హీరోయిన్లు ఆరోపించారు. తాజాగా 'కొమురం పులి' చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించిన నికీషా పటేల్ కూడా దీనిపై స్పందించింది.

సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హజరుకాకపోవడాన్ని నికీషా తప్పుపట్టింది. అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు హాజరుకాలేదనేదే తన ప్రశ్న అని అంది. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా? అని దుయ్యబట్టింది. బాలీవుడ్ లో మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. సుశాంత్ స్టార్ వారసుడు కాదని... ఇలాంటి వారిని బాలీవుడ్ లో ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించింది. సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వారెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Sushant Singh Rajput
Bollywood
Nikisha Patel

More Telugu News