సుశాంత్‌ను క్రికెటర్‌గా పేర్కొన్నారంటూ రాహుల్‌ గాంధీపై విమర్శలు.. నకిలీ ట్వీటని చెబుతున్న కాంగ్రెస్

Rahul Gandhi fake tweet viral
  • సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ ట్వీట్
  • మార్ఫింగ్ చేసిన కొందరు
  • అది రాహుల్ ట్వీట్ కాదని చెప్పిన కాంగ్రెస్ మద్దతుదారులు
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనను క్రికెటర్‌గా పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారంటూ ఓ నకిలీ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. యువకుడు, మంచి నైపుణ్యాలు కలిగిన క్రికెటర్ మృతి పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు అందులో ఉంది.
                      
కొందరు వైరల్‌ చేస్తోన్న ఈ స్క్రీన్‌ షాట్‌పై నెటిజన్లు సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి నాలెడ్జ్‌ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై రాహుల్ మద్దతుదారులు స్పందిస్తూ ఆ ట్వీట్‌ నకిలీదని, రాహుల్ చేసిన ఒరిజినల్ ట్వీట్ అదికాదని చెబుతున్నారు. ఆ రెండు ట్వీట్లను కలిపి పోస్ట్ చేస్తూ వివరణ ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొందరు ఫొటో షాప్ చేసి వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు.
Go Back to Shorts
Viral Pics
Rahul Gandhi
Congress
Twitter

More Telugu News