Nara Lokesh: సీఎం జగన్ అధికార మదానికి ఇది పరాకాష్ఠ: నారా లోకేశ్

lokesh fires on jagan
షార్ట్స్‌లో చూడండి
ఒంటరిగా, మౌనంగా నిరసన తెలుపుతున్న వారిని కూడా వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా, బద్వేల్ కి చెందిన ఓ టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారని తెలుపుతూ ఆయన ఫొటోను లోకేశ్ పోస్ట్ చేశారు.

'రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా కడప జిల్లా, బద్వేల్ కి చెందిన టీడీపీ కార్యకర్త వేణు గోపాల్ తన నివాసంలో ఒంటరిగా దీక్ష చేపడితే అరెస్ట్ చెయ్యడం సీఎం జగన్ అధికార మదానికి పరాకాష్ఠ. ఈ దుర్మార్గపు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వేణు గోపాల్ కి పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుంది' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News