పెళ్లి తరువాత అత్తారింటికి వెళుతూ... మధ్యలో నదిలో దూకేసిన నవ వధువు!
- రాజస్థాన్ లో ఆదివారం వివాహం
- ఆ వెంటనే మధ్యప్రదేశ్ కు బయలుదేరిన పెళ్లివారు
- చంబల్ నదిలో దూకేసిన నవ వధువు
అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగా జరిగింది. తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్ కు ఆమె బయలుదేరింది. షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరినా, డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్ ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు.
ఆ వెంటనే వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తరువాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.