'షకీల రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం'కు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- విడుదలకు సిద్ధమైన షకీల కొత్త సినిమా
- సినిమాలో జంటగా విక్రాంత్, పల్లవి ఘోష్
- త్వరలోనే విడుదలపై నిర్ణయం
ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్ధమైన సమయంలో లాక్ డౌన్ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క మ్యూట్ తప్ప మరెలాంటి కట్లు, మ్యూట్లు లేవని చిత్ర యూనిట్ తెలిపింది.
రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయని దర్శకుడు సాయిరాం దాసరి తెలిపాడు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా? లేక ఓటీటీలో విడుదల చేయాలా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.