నేటి నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు!
- ప్రారంభమైన అన్ లాక్ 1.0
- థియేటర్లు, బార్లకు మాత్రం లభించని అనుమతి
- పూర్తి స్థాయిలో సాగనున్న కమర్షియల్ ఆపరేషన్స్
ఇక ఈ ఉదయం తమతమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో గత వారం రోజుల నుంచే స్టార్ హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లు, మాల్స్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేసుకున్నాయి. మెయిన్ గేట్ల వద్దే శానిటైజేషన్, ధర్మల్ స్క్రీనింగ్ ను ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. దీంతో నేటి నుంచి దాదాపు పూర్తి స్థాయిలో కమర్షియల్ లావాదేవీలన్నీ మొదలవుతున్నట్టే!